మనదేశం 2030 నాటికి గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మీరు కోరుకుంటున్నారా?
మనదేశం అభివృద్ధి చెందాలి అంటే మన రాజకీయాల తీరు మారాలని మీరు నమ్ముతున్నారా?
మన ఎన్నికల వ్యవస్థలో లోపాల కారణంగా డబ్బు తప్ప వేరే ఏ అర్హత లేనివాళ్ళుఎన్నికవుతున్నారు అని మీరు భావిస్తున్నారా?
మనదేశంలో పెరుగుతున్న కులపిచ్చి మనదేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని మీరు ఆవేదనచెందుతున్నారా?
మన ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసం అమలు చేస్తున్న జనాకర్షక పథకాల వల్ల దేశంనష్టపోతోంది అని మీరు భావిస్తున్నారా?
కార్పోరేట్ అవినీతి, క్రోనీ క్యాపటలిజం వల్ల దేశం వెనుకబడిపోతోంది అని బాధపడుతున్నారా?
దేశం ఎదగాలి అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలని మీరునమ్ముతున్నారా?
దేశంలో రాజకీయాలకి అతీతంగా, తప్పు ఒప్పులని ప్రజలకి వివరించే తటస్థ వేదికలు అవసరంఅని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
దేశం ఏ ఒక్కరోజులోనో, ఏ ఒక్క నాయకుడితోనే మారదు, మార్పుకోసం ఒక నిరంతర ప్రయత్నంజరగాలని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా?
మనం కలసికట్టుగా పనిచేస్తే “కొన్నైనా మార్పులు సాధించగలం” అనే విశ్వాసం మీకుందా?
ఈ 10 ప్రశ్నలకు మీ సమాధానాలు అవును అయితే, మీలాంటి వ్యక్తులే నడుపుతున్న ఈ
జనపక్షం ఉద్యమానికి స్వాగతం.