గ్రామాలని అభివృద్ధి చేయాలని,గ్రామీణ ప్రజల జీవనప్రమాణాలుమెరుగుపరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి, ఎన్నో పథకాలు ప్రారంభిస్తున్నాయి. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కావచ్చు, మరేదైనా కావచ్చు. దేశంలో అతి కొద్ది గ్రామాలలో మాత్రమే సత్ఫలితాలు ఇచ్చాయి.
దేశం మొత్తం మీద ఆదర్శ గ్రామాల సంఖ్య 500 లోపే అనేది నమ్మలేని నిజం. ఆదర్శ గ్రామాల నిర్మాణం కోసం జరిగిన సఫల ప్రయత్నాలను, విఫల ప్రయత్నాలను మేము జాగ్రత్తగా అధ్యయనం చేసాం. గ్రామాల ఎంపిక దగ్గర నుండి ప్రజల నిరంతర భాగస్వామ్యాన్ని కొనసాగించడం దాకా అన్ని కోణాలను మేము పరిశీలించాం. మా అధ్యయనం ప్రకారం..
జీవన నాణ్యత మెరుగుపడడం
100% డిజిటల్ విలేజ్
పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడం
ప్రజల తలసరి ఆదాయాలలో వృద్ధి
ఈ నాలుగు సాధించగలిగితే , ఆ గ్రామాన్ని ఆదర్శగ్రామం అని చెప్పవచ్చు.
అయితే, ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలంటే కేవలం డబ్బు ఒక్కటే సరిపోదు. ఆ గ్రామస్తుల భాగస్వామ్యం అనేది అన్నిటికన్నా కీలకం.
“మీ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను, మీరు సహకరిస్తారా అని ఏ గ్రామ ప్రజలను అడిగినా సహకరిస్తాం అనే హామీ ఇస్తారు. కానీ ఆ తర్వాత గ్రామ రాజకీయాలు, ముఠా తగాదాలు, కులాల మధ్య వివాదాలు లాంటివి అన్నీ ముందుకు వస్తాయి. దానితో డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఆశించిన ఫలితం రాదు.
గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై మా బృందానికి పాషన్, అనుభవం ఎక్స్ పోజర్ ఉన్నాయి.
కాబట్టి ఆదర్శ గ్రామాల అభివృద్ధి కోసం మా సేవలను వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము .